భారతదేశం, ఏప్రిల్ 7 -- Vijay Rashmika Kodagu Reception: టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో అత్యంత వైభవంగా వీరి వివాహం జరిగిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట రష్మిక స్వస్థలమైన కర్ణాటకలోని కొడగు (కూర్గ్)లో సోమవారం (ఏప్రిల్ 6) నాడు ఒక గ్రాండ్ రిసెప్షన్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో విజయ్ దేవరకొండ ఇచ్చిన స్పీచ్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రిసెప్షన్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. తనకు కొడగు ప్రాంతం అంటే ఎంతో ఇష్టమని, ఇక్కడికి తాను రావడం ఇది మూడోసారి అని పేర్కొన్నాడు.

"ఈ ప్రాంతం చాలా అందమైనది. ఇక్కడి వాతావరణం నాకు చాలా నచ్చింది. నిజం చెప్పాలంటే రష్మికను కలవకముందే కొడగు మహిళలు చాలా అందంగా ఉంటారని నేను భావించేవాడిని. ఇప్పుడు ఇక్కడి అమ్మాయినే పెళ్లి...