భారతదేశం, ఏప్రిల్ 2 -- తమిళనాడు రాజకీయ తెరపై కొత్త అధ్యాయం మొదలైంది. తమిళ సూపర్ స్టార్, 'తమిళగ వెట్రి కళగం' (TVK) వ్యవస్థాపకుడు విజయ్ గురువారం (ఏప్రిల్ 2) తిరుచ్చిలో తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ సందర్భంగా తరలివచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తూ.. అధికార డీఎంకే ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. తన రాజకీయ ప్రవేశాన్ని అడ్డుకోవడానికి అన్ని పార్టీలు ఏకమయ్యాయని, తన చివరి చిత్రం 'జన నాయగన్' విడుదల కాకుండా కుట్ర పన్నాయని ఆయన ఆరోపించారు.
దళపతి విజయ్ నామినేషన్ వేయడానికి వస్తున్నారని తెలియడంతో తిరుచ్చి వీధులన్నీ అభిమానులతో కిక్కిరిసిపోయాయి. భారీ జనసందోహం మధ్య ఆయన వాహనం నెమ్మదిగా కదిలింది. ఈ క్రమంలో దారిలో కిందపడిపోయిన దంపతులను చూసి విజయ్ తన వాహనం దిగి స్వయంగా వారిని పరామర్శించడం అక్కడి వారిని ఆకట్టుకుంది. అనంతరం ఆయన పెరంబూర్, తిర...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.