భారతదేశం, అక్టోబర్ 26 -- Vijay Deverakonda: టాలీవుడ్ స్టార్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న తమ పర్సనల్ లైఫ్, పెళ్లికి సంబంధించిన విషయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న విష ప్రచారానికి చెక్ పెడుతూ సరికొత్త యుద్ధమే ప్రకటించారు. ఇటీవల ప్రముఖ బాలీవుడ్ టాక్ షో 'కాఫీ విత్ కరణ్ సీజన్ 9' (Koffee With Karan 9)లో ఈ జంట పాల్గొన్న సంగతి తెలిసిందే.

ఆ ఎపిసోడ్‌లో తమ ప్రేమ, ప్రపోజల్ గురించి సరదాగా పంచుకున్న మాటలను కొంతమంది సోషల్ మీడియా సైకాలజిస్టులు, నెటిజన్లు తప్పుగా చిత్రీకరిస్తూ విజయ్‌ను 'రెడ్ ఫ్లాగ్' అంటూ విమర్శించడం ప్రారంభించారు. తాజాగా ఈ నెగెటివిటీపై రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ తన మార్క్ బోల్డ్ స్టైల్లో స్పందిస్తూ నెట్టింట అగ్గి రాజేశారు. ఇప్పటికే రష్మిక సుదీర్ఘ పోస్ట్‌తో ట్రోలర్ల నోళ్లు మూయించగా, ఇప్పుడు విజయ్ వైల్డ్ రెస్పాన్స్ సోషల్ మీడియాను ఊపే...