భారతదేశం, ఏప్రిల్ 18 -- Vijay Deverakonda: టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ తన కెరీర్‌లో అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్‌ కు సిద్ధమయ్యాడు. 'హాయ్ నాన్న' చిత్రంతో తన ప్రతిభను నిరూపించుకున్న దర్శకుడు శౌర్యువ్ దర్శకత్వంలో విజయ్ తన తదుపరి చిత్రాన్ని ప్రకటించాడు. ప్రస్తుతానికి 'VDxShouryuv' అనే వర్కింగ్ టైటిల్‌తో శనివారం (ఏప్రిల్ 18) పోస్టర్ పోస్టు చేశాడు.

విజయ్ దేవరకొండ మరో కొత్త సినిమాతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేయబోతున్నాడు. శౌర్యువ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా విజయ్ దేవరకొండ అనౌన్స్ చేశాడు. ఈ క్రమంలో అతను షేర్ చేసిన పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. కుక్కలను పట్టుకుని విజయ్ ముందు నడవగా.. ఆయుధాలు, గుర్రంతో అతని టీమ్ వెనకాలే వస్తుంది. శౌర్యువ్ గుర్రాన్ని పట్టుకున్నాడు.

ఈ సినిమా గురించి విజయ్ రాసుకొచ్చిన మాట...