భారతదేశం, అక్టోబర్ 14 -- Vijay Deverakonda: ఈ శుక్రవారం (అక్టోబర్ 16) థియేటర్లలో సందడి చేయడానికి విజయ్ దేవరకొండ నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ 'రణబలి' సిద్ధమైంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. మంగళవారం (అక్టోబర్ 13) రాత్రి హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్‌గా జరిగింది.

ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "ఈ ఈవెంట్ కు వచ్చిన దర్శకులందరికీ నా ధన్యవాదాలు. అప్పుడే పండుగ వాతావరణం మొదలైపోయింది. 'రణబాలి' సినిమా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలా ఉంటుంది'' అని తెలిపారు.

''దర్శకుడు రాహుల్ ఒక పీరియడ్ మాస్ యాక్షన్ డ్రామాను తెరకెక్కించడానికి ఎంతో రీసెర్చ్ చేశాడు. చరిత్రలో ఎవరికీ తెలియని ఒక చీకటి అధ్యాయాన్ని ఈ సినిమా కోసం రీసెర్చ్ చేసి కనుక్కు...