భారతదేశం, జూన్ 14 -- Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) కేవలం స్క్రీన్‌పైనే కాదు, రియల్ లైఫ్‌లోనూ తన మార్క్ చాటుకునేందుకు ఒక భారీ సోషల్ ఇనిషియేటివ్‌ను అనౌన్స్ చేశాడు. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన టాపర్స్ కు స్కాలర్‌షిప్‌లు అందిస్తానని ప్రకటించాడు.

తన సొంత మండలం అచ్చంపేటలోని ప్రభుత్వ పాఠశాల్లలో 9,10 వ తరగతి క్లాస్ ల్లో ఇద్దరు టాపర్ల చొప్పున 180 మందికి విజయ్ దేవరకొండ అండగా నిలిచిన సంగతి తెలిసిందే. 'ది దేవరకొండ ఫౌండేషన్' తరపున ఈ స్టూడెంట్స్ కు ఇవాళ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి స్కాలర్ షిప్ లు అందించారు. ఈ ఈవెంట్ సందర్భంగా విజయ్ దేవరకొండ సంచలన ప్రకటన చేశాడు.

ఆదివారం (జూన్ 14) తన సొంతూరు తుమ్మన్‌పేటలో అచ్చంపేట మండలంలోని ప్రభుత్వ పాఠశాలల టాపర్లకు స్కాలర్ షిప్ లు అంద...