భారతదేశం, మార్చి 9 -- దాదాపు 15 రోజులుగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి, రిసెప్షన్ వార్తలు ట్రెండింగ్ లో కొనసాగాయి. మార్చి 4న హైదరాబాద్ లో విరోష్ రిసెప్షన్ ముగిసింది. సెలబ్రేషన్స్ ఓవర్ ఇక అండర్ గ్రౌండ్ వెళ్లిపోతామని రిసెప్షన్ ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ చెప్పాడు. విజయ్ సరదాకే చెప్పాడేమో అనుకున్నారు కానీ ఆ తర్వాత విరోష్ జోడీ ఎక్కడా కనిపించలేదు.

రిసెప్షన్ తర్వాత విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హనీమూన్ వెళ్లారనే వార్తలు వచ్చాయి. మరోవైపు పెళ్లి, రిసెప్షన్ సందడి తర్వాత విరోష్ జోడీ రెస్ట్ తీసుకుంటుందని కొంతమంది అంటున్నారు. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ మళ్లీ షూటింగ్ స్టార్ట్ చేయబోతున్నాడనే బజ్ క్రేజీగా మారింది.

విజయ్ దేవరకొండ ప్రస్తుతం హీరోగా చేస్తున్న సినిమాల్లో 'రణబాలి' ఒకటి. పీరియాడిక్ యాక్షన్ థ్రిల్లర్ గా, రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరక...