భారతదేశం, మే 9 -- Tamil Nadu CM oath : తమిళనాడు రాజకీయాల్లో ఒక కొత్త శకం మొదలైందని భావిస్తున్న తరుణంలో.. దళపతి విజయ్ 'పట్టాభిషేకం' ప్రస్తుతం అనిశ్చితిలో పడింది. ద్రవిడ కోటలో ఎన్నికల బ్లాక్ బస్టర్ హిట్ సాధించినప్పటికీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీని నిరూపించుకోవడంలో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (టీవీకే) తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. శుక్రవారం నాటికి అంతా సెట్​ అయినట్టే కనిపించినా, విజయ్​ శనివారం కూడా ప్రమాణ స్వీకారం చేయలేకపోవచ్చని వార్తలు వినిపిస్తున్నాయి.

శుక్రవారం సాయంత్రం వరకు విజయ్ ముఖ్యమంత్రి కావడం లాంఛనమే అని భావించినప్పటికీ, చివరి నిమిషంలో పరిణామాలు వేగంగా మారిపోయాయి. టీటీవీ దినకరన్ నేతృత్వంలోని ఏఎంఎంకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) పార్టీలు విజయ్‌కు మద్దతు ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో సీన్ రి...