భారతదేశం, మే 3 -- కరీంనగర్‌లో పట్టపగలే దొంగల బీభత్సం సృష్టించారు. జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాపులో తుపాకీలతో లోపలికి చొరబడ్డారు. సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మెుత్తం ఐదుగురు దుండగులు ఉన్నట్టుగా గుర్తించారు. కాల్పులు జరపడంతో పలువురికి గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. పలువురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకుని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా నిందితుల కోసం గాలింపు చేపట్టారు పోలీసులు.
దుండగుల బృందం ఒకటి వినియోగదారుల వేషంలో పీఎంజే నగల దుకాణంలోకి ప్రవేశించింది. క్షణాల్లోనే వారు భయాందోళనలు సృష్టించారు. ఎవరూ ఎదురుతిరగకుండా ఉండేందుకు, ప్రతిఘటనను నివారించేందుకు తుపాకులు బయటకు తీసి కాల్పులు జరపడం ప్రారంభించారు. ఈ గందరగోళంలో నలుగురు సిబ్బందికి తుపాకీ గాయాలయ్యాయి. వారిని ...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.