భారతదేశం, ఏప్రిల్ 24 -- ప్రేమ, ఐశ్వర్యం, సౌందర్యం మొదలైన వాటికి కారకుడు శుక్రుడు. శుక్రుడు ప్రస్తుతం సొంత రాశి అయినటువంటి వృషభంలో సంచారం చేస్తున్నాడు. ఒక గ్రహం తన సొంత రాశిలో ఉన్నప్పుడు దాని ప్రభావం చాలా శక్తివంతంగా ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు నక్షత్రం మార్పు చేయబోతున్నాడు. మరో మూడు రోజుల్లో, అంటే ఏప్రిల్ 27న శుక్రవారం, రోహిణి నక్షత్రంలోకి అడుగుపెట్టబోతున్నాడు.

ఈ నక్షత్రానికి అధిపతి చంద్రుడు. చంద్రుడు మనసుకు కారకుడు. అయితే శుక్రుడు భౌతిక సుఖాలకు కారకుడు. ఈ రెండు గ్రహాల ప్రభావం వలన ఆకర్షణ, సృజనాత్మకత, సంపద కలుగుతాయి. ముఖ్యంగా ఈ సమయంలో వ్యాపారవేత్తలు, ఉద్యోగస్తులు, కళాకారుల లైఫ్ మారిపోతుంది. స్వర్ణ అవకాశమని చెప్పొచ్చు. శుక్రుడి నక్షత్ర సంచారంతో ఏ రాశుల వారికి లాభాలు కలగబోతున్నాయి? ఆ అదృష్ట రాశులు ఎవరు? వీరిలో మీరు ఉన్నారేమో చూసుకోండి.

మేష ర...