భారతదేశం, జూన్ 21 -- VenkyAnil5: వెంకటేష్- కళ్యాణ్ రామ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న మూవీ సందడి అప్పుడే షురూ అయింది. రీసెంట్ గా ఈ సినిమా పూజ కార్యక్రమం నిర్వహించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ డిఫరెంట్ ప్రమోషనల్ వీడియో వదిలింది టీమ్. ఇందులో అనిల్ తో హీరో హీరోయిన్లు ఓ ఆటాడుకున్నారు.

ఆదివారం (జూన్ 21) అనిల్ రావిపూడి కొత్త సినిమా ప్రమోషనల్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోలో.. ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్ తో వెంకటేష్, కళ్యాణ్ రామ్ మాట్లాడుతుంటారు. ఇసుకలో పాతేశారంటీ పాపమని వెంకటేష్ అంటాడు. పటాస్ టైమ్ లో అనిల్ బాగానే ఉన్నాడు, కానీ 'నేను పాడతా' అంటూ మీరే ఇలా చేశారని కళ్యాణ్ రామ్ కౌంటర్ ఇస్తాడు. అప్పుడే హీరోయిన్లు కీర్తి సురేష్, కృతి శెట్టి భయంతో పరుగెత్తుకుంటూ వస్తారు.

హీరోయిన్ల వెనుకాలే కత్తి పట్టుకుని...