భారతదేశం, మే 26 -- చాలా మంది వాస్తు ప్రకారం పాటిస్తూ ఉంటారు. వాస్తు ప్రకారం పాటిస్తే సానుకూల శక్తి ప్రవహిస్తుంది, ప్రతికూల శక్తి తొలగిపోతుంది. మనం ఉండే ఇంటికి ప్రధాన ద్వారం అనేది ప్రవేశ మార్గమే కాదు, వాస్తు ప్రకారం సానుకూల లేదా ప్రతికూల శక్తి ప్రవేశించే మార్గం కూడా. అయితే కొత్త ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రధాన ద్వారం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం.

ఒకవేళ వాస్తు దోషం ఉన్నట్లయితే, ఆ ఇంటి యజమాని ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా విజయం రాకపోవచ్చు. ఆర్థిక ఇబ్బందులు, మానసిక అశాంతి, అనారోగ్య సమస్యలు ఇలా ఎన్నో వెంటాడుతూ ఉంటాయి. సంపదకు అధిదేవత అయిన లక్ష్మీదేవి అడుగు పెట్టదని పండితులు కూడా హెచ్చరిస్తున్నారు. కేవలం ద్వారం దిశే కాదు, రంగు కూడా అదృష్టాన్ని ప్రభావితం చేస్తుంది. అయితే ఇంటి ముఖద్వారం వాస్తును ఆధారంగా తీసుకుని ఏ రంగు వేస్తే మంచిదో...