భారతదేశం, జూన్ 23 -- హిందూ సంప్రదాయంలో చీపురును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఇంటిని శుభ్రంగా ఉంచుకునే గడపల్లోనే సిరిసంపదలు తాండవిస్తాయని పెద్దల నమ్మకం. అయితే, శుభ్రతకు చిహ్నమైన చీపురును అజాగ్రత్తగా వాడితే, అది లక్ష్మీదేవికి ఆగ్రహం తెప్పించి, ఇంట్లో వాస్తు దోషాలకు దారితీస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. తెలియక మనం చేసే చిన్న చిన్న పొరపాట్లు ఆర్థిక సంక్షోభాలకు, అనారోగ్య సమస్యలకు మూలకారణం కావచ్చు. చీపురు విషయంలో మీరు తప్పక తెలుసుకోవాల్సిన 5 ప్రధాన నియమాలు ఇక్కడ ఉన్నాయి.

చీపురును ఇంటి ఈశాన్య మూలలో ఎప్పుడూ ఉంచకండి. ఈశాన్య దిశను దైవ స్థానంగా, లక్ష్మీదేవి సంచరించే మార్గంగా పరిగణిస్తారు. అక్కడ చీపురు ఉంచడం వల్ల కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. చీపురును ఎల్లప్పుడూ దక్షిణం లేదా నైరుతి దిశలో ఉంచడమే శ్రేయస్కరం. ఇలా చేయడం వల్...