భారతదేశం, ఏప్రిల్ 28 -- సాధారణంగా ఇంటిని శుభ్రం చేసేటప్పుడు గోడల మూలల్లోనో లేదా అటకల పైనో సాలీడు గూళ్లు (Spider Webs) కనిపిస్తూనే ఉంటాయి. "రేపు చేద్దాం.. ఎల్లుండి చేద్దాం" అని మనం చేసే ఆలస్యం, మన జీవితంలోకి ప్రతికూల శక్తిని (Negative Energy) ఆహ్వానించినట్టే అవుతుందని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాస్తు శాస్త్రం ప్రకారం, సాలీడు గూడు అనేది కేవలం ఒక జంతువు కట్టుకున్న నివాసం మాత్రమే కాదు, అది ఇంట్లోని సానుకూల శక్తిని బంధించే ఒక ఉచ్చు వంటిది.

వాస్తు సిద్ధాంతాల ప్రకారం, ఇంట్లో గాలి, వెలుతురు ఎంత స్వేచ్ఛగా ప్రసరించాలో, శక్తి కూడా అంతే వేగంగా ప్రవహించాలి. సాలీడు గూళ్లు ఉన్న చోట శక్తి ప్రవాహం ఆగిపోతుంది. దీనివల్ల ఇంట్లో ఉండేవారికి పనుల్లో ఆటంకాలు ఏర్పడటం, అనారోగ్యం పాలవ్వడం వంటివి జరుగుతాయి. ముఖ్యంగా ఈ మూడు ప్రదేశాల్లో సాలీడు గూళ్లు ఉండటం అ...