భారతదేశం, జూలై 19 -- Varun Tej: కొరియన్ కనకరాజు అంటూ హారర్ థ్రిల్లర్ తో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ రెడీ అవుతున్నాడు. ఈ మూవీ నుంచి 'రాసగుమ్మడి' సాంగ్ ను ఇవాళ (జూలై 19) లాంఛ్ చేశారు. ఈ ఈవెంట్లో వరుణ్ తేజ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.

కొరియన్ కనకరాజు సినిమాలోని 'రాసగుమ్మడి' సాంగ్ ను మూవీ టీమ్ ఆదివారం రిలీజ్ చేసింది. దీని కోసం అనంతపురంలోని వీ మెగా థియేటర్లో ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ కు వరుణ్ తేజ్ చేతి కర్ర సాయంతోనే వచ్చాడు. స్టేజీపై అలాగే నిలబడ్డాడు. వరుణ్ తేజ్ కాలుకు మూడు నెలల క్రితం సర్జరీ అయిన సంగతి తెలిసిందే.

సాంగ్ లాంఛ్ ఈవెంట్ సందర్బంగా వరుణ్ తేజ్ కామెంట్లు వైరల్ గా మారాయి. ''అనంతపురంలో షూటింగ్ చేశాం కాబట్టి, సెంటిమెంట్ గా ఫస్ట్ ఈవెంట్ ఇక్కడే పెట్టాలనుకున్నాం. మీ అందరి ముందు పాటను రిలీజ్ చేయడం చాలా ఆనం...