భారతదేశం, ఏప్రిల్ 13 -- Varanasi Leak: టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న మూవీ 'వారణాసి'. సూపర్ స్టార్ మహేష్ బాబు- రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ఫస్ట్ సినిమా కావడంతో వారణాసిపై అంచనాలు మామూలుగా లేవు. పైగా టైటిల్, టీజర్ తో ఈ హైప్ ను మూవీ టీమ్ మరింత పెంచేసేంది. అయితే మరోవైపు మాత్రం వారణాసి సినిమాకు లీక్ ల బెడద తప్పట్లేదు.

వాారణాసి నుంచి ఓ సీన్ వీడియో లీకైందని సోషల్ మీడియాలో ఓ పోస్టు చక్కర్లు కొడుతోంది. రామోజీ ఫిల్మ్ సిటీలోని చెరువులో బోట్ సీక్వెన్స్ షూట్ చేస్తున్నట్లుగా అందులో ఉంది. ఇది వారణాసి సినిమా షూటింగ్ అని ఆ వీడియోను తెగ వైరల్ చేసేస్తున్నారు.

తన సినిమా షూటింగ్ విషయంలో రాజమౌళి ఎంత పర్ఫెక్ట్ గా ఉంటారో, అంతే స్ట్రిక్ట్ గా ఉంటారు. తన సెట్ నుంచి చిన్న ఫొటోను కూడా బయటకు వెళ్లనివ్వడు. అలాంటిది వారణాసి సి...