భారతదేశం, ఆగస్టు 26 -- గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రిలయన్స్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న 'వంతారా వన్యప్రాణి రెస్క్యూ సెంటర్' కార్యకలాపాలపై దర్యాప్తు చేసేందుకు సుప్రీంకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)ని ఏర్పాటు చేసింది. ఈ బృందానికి సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ జే చలమేశ్వర్ నాయకత్వం వహిస్తారు.

వంతారా కేంద్రం జంతువులను సేకరించడంలో, ముఖ్యంగా ఏనుగులను దేశీయంగా, విదేశాల నుంచి తీసుకురావడంలో వన్యప్రాణి సంరక్షణ చట్టం, ఇతర సంబంధిత చట్టాలను పాటించిందా లేదా అని సిట్ పరిశీలిస్తుంది.

వంతారాపై దేశ-విదేశాల్లో జంతువుల అక్రమ కొనుగోలు, సరిగ్గా చూసుకోకపోవడం, ఆర్థిక అవకతవకలు, మనీ లాండరింగ్​ ఆరోపణలు వేస్తూ రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. వాటిని విచారించిన సర్వోన్నత న్యాయస్థానం సిట్​ దర్యాప్తునకు ఆదేశాలిచ్చింది.

అయితే ఈ విచారణ ఉత్తర్వులను ఏ సంస్థ పని...