భారతదేశం, ఏప్రిల్ 30 -- Vaishnavi: ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య.. బేబీ మూవీతో ఇండస్ట్రీని షేక్ చేసిన జంట ఇది. వీళ్లు కలిసి స్క్రీన్ పై చేసిన మ్యాజిక్ కారణంగా బేబీ సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు మరోసారి తమ కెమిస్ట్రీతో ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఆనంద్, వైష్ణవి రెడీ అయ్యారు. ఈ జంట తాజాగా కలిసి నటిస్తున్న మూవీ 'ఎపిక్'.

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న 'ఎపిక్' మూవీ టీజర్ రీసెంట్ గా రిలీజ్ చేశారు. ఇందులో రొమాన్స్ తో ఈ జోడీ రెచ్చిపోయింది. వేరే లెవల్ కెమెస్ట్రీని చూపించేందుకు రెడీ అయింది. అయితే ఈ టీజర్ లాంఛ్ ఈవెంట్లో వైష్ణవి చైతన్యకు ఆనంద్ సపోర్ట్ గా మాట్లాడటం తెగ వైరల్ గా మారింది.

బుధవారం (ఏప్రిల్ 29) ఎపిక్ మూవీ టీజర్ లాంఛ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్లో హీరో ఆనంద్ దేవరకొండ, హీరోయిన్ వైష్ణవి చైతన్య, డైరెక్టర్ ఆ...