భారతదేశం, డిసెంబర్ 26 -- ఏకాదశి తిధికి ఉన్న విశిష్టత గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధించిన చక్కటి ఫలితం కలుగుతుంది. అందుకే చాలా మంది ప్రతి ఏకాదశి నాడు ఉపవాసం ఉంటారు. త్వరలోనే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి రాబోతోంది. ఈ ఏకాదశి చాలా విశిష్టమైనది. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకునే రోజు ఇది. ఆ రోజు విష్ణువును భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే ఎంతో పుణ్యం కలుగుతుంది. ఆరోజు చేయాల్సినవి, చేయకూడని వాటి గురించి కూడా ఈరోజు తెలుసుకుందాం.

ఈ ఏడాది ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి డిసెంబర్ 30, మంగళవారం నాడు వచ్చింది. ఈరోజు మంచి పనులు చేస్తే శుభ ఫలితాలు ఎదురవుతాయి. చెడ్డ పనులు చేయడం వలన సమస్యలు వస్తాయి. తెలిసి కానీ తెలియక కానీ కొన్ని పొరపాట్లు చేయడం మంచిది కాదు.

వైకుంఠ ఏకాదశి నాడు తులసి ...