భారతదేశం, జూన్ 21 -- యంగ్ గన్ వైభవ్​ సూర్యవంశీ మరోసారి సంచలనం సృష్టించాడు! శ్రీలంక ఏ టీమ్​తో ఇండియా ఏ జట్టు ఆడుతున్న ట్రై నేషన్ ఏ సిరీస్ ఫైనల్​ మ్యాచ్​లో కేవలం 29 బంతుల్లోనే 94 చేశాడు.

డంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో టాస్ గెలిచి బౌలింగ్​ ఎంచుకున్న శ్రీలంక ఏ జట్టు బౌలర్లకు సూర్యవంశీ మొదటి నుంచి చుక్కలు చూపిస్తూనే ఉన్నాడు. ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిన అతను కేవలం 11 బంతుల్లోనే హాఫ్​ సెంచరీ కొట్టేశాడు. ఆ తర్వాత కూడా సూర్యవంశీ జోరు కొనసాగింది. 94 రన్స్​లో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉండటం విశేషం. అంటే బౌండరీ రూపంలోనే అతను 88 పరుగులు సాధించినట్టు!

కానీ.. శ్రీలంక ఏ బౌలర సహన్ అరచ్చిగే బౌలింగ్​లో ఔట్​ అయ్యి, తృటిలో సెంచరీ మిస్​ చేసుకుని నిరాశతో వెనుదిరిగాడు.

వైభవ్​ సూర్యవంశీ ఊచకోత కారణంగా భారత్​ ఏ స్కోరు 9 ఓవర్లకే 130 దాటేసింది. మరో ఓపెనర్​ ప...