భారతదేశం, మార్చి 31 -- ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ యువ వజ్రం వైభవ్ సూర్యవంశీ సంచలనం సృష్టించాడు. కేవలం 15 ఏళ్ల వయసులోనే చెన్నై సూపర్ కింగ్స్‌పై 15 బంతుల్లోనే హాఫ్ సెంచరీ బాదాడు. మైదానంలో అతను చూపించిన ఈ విధ్వంసకర బ్యాటింగ్ వెనుక కఠినమైన క్రమశిక్షణ దాగి ఉంది. ఈ అంకితభావమే అతడిని అతిచిన్న వయసులోనే ఐపీఎల్ స్టార్‌గా మార్చిందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

మార్చి 27న వైభవ్ తన 15వ ఏట అడుగుపెట్టినా బర్త్ డే వేడుకల కంటే ఆటకే ప్రాధాన్యత ఇచ్చాడు. "కేక్ కటింగ్ ఉండాల్సింది, కానీ నా మొహానికి కేక్ పూయించుకోవడం నాకు ఇష్టం లేదు. పైగా మ్యాచ్ ప్రాక్టీస్ కోసం త్వరగా నిద్రపోవాలని అనుకున్నా. అందుకే కేక్ కట్ చేయలేదు" అని వైభవ్ సూర్యవంశీ అన్నాడు. ఈ చిన్న వయసులో వైభవ్ చూపిన అంకితభావం చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

ఐపీఎల్ 2026లో సోమవారం (మార్చి 30) ...