భారతదేశం, ఏప్రిల్ 3 -- Ustaad Bhagat Singh Losses: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన 'ఉస్తాద్ భగత్ సింగ్' (Ustaad Bhagat Singh) థియేట్రికల్ రన్ అత్యంత నిరాశాజనకంగా ముగిసింది. 'గబ్బర్ సింగ్' వంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకాయి.

అయితే ఆ అంచనాలను అందుకోవడంలో ఈ సినిమా పూర్తిగా విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కనీస ప్రభావం చూపలేక ఈ సినిమా ఒక భారీ 'డిజాస్టర్'గా మిగిలిపోయింది. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా కనీసం రూ. 100 కోట్ల గ్రాస్ మార్కును కూడా చేరుకోలేకపోవడం ట్రేడ్ వర్గాలను విస్మయానికి గురిచేస్తోంది.

దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని, సోషల్ మీడియాలోనూ, బయట కూడా భారీగా ప్రమోషన్లు నిర్వహించారు. కానీ థియేటర్లలోకి వచ్చ...