భారతదేశం, ఏప్రిల్ 4 -- ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా విహరించవచ్చన్న అమెరికా ధీమాకు గట్టి దెబ్బ తగిలింది! గత 24 గంటల్లో ఇరాన్ జరిపిన దాడుల్లో రెండు అమెరికా యుద్ధ విమానాలు, గాలింపు చర్యల్లో ఉన్న రెండు బ్లాక్ హాక్ హెలికాప్టర్లు దెబ్బతినడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తోంది. ఇరాన్ సైనిక శక్తి అమెరికాతో సమానమని చెప్పలేం కానీ, "టెహ్రాన్ గగనతలంపై మాదే పూర్తి అధికారం" అన్న అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలు మాత్రం పసలేనివని తేలిపోయాయి. శుక్రవారం నాటి పరిణామాలు ట్రంప్ యంత్రాంగాన్ని ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. అసలు పాతబడిన గగనతల రక్షణ వ్యవస్థ ఉన్న ఇరాన్.. ఇంతటి అత్యాధునిక విమానాలను ఎలా కూల్చగలిగింది?

అమెరికా ఊహించని పద్ధతుల్లో దెబ్బకొట్టడం (అసిమెట్రిక్​ వార్​ఫేర్) ఇరాన్‌కు వెన్నతో పెట్టిన విద్య. యుద్ధం మొదలై రెండో నెలలోకి ప్రవేశించినా, ఇ...