భారతదేశం, ఏప్రిల్ 12 -- పశ్చిమాసియాలో యుద్ధ మేఘాలు మళ్లీ కమ్ముకున్నాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధాన్ని ముగించేందుకు పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌ వేదికగా జరిగిన అత్యంత కీలకమైన చర్చలు విఫలమయ్యాయి! దాదాపు 21 గంటల పాటు సాగిన మారథాన్ చర్చల అనంతరం, అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఆదివారం ఇస్లామాబాద్ నుంచి వెనుదిరిగారు. చర్చలు ఫలించలేదని, ఈ పరిణామం అమెరికా కంటే ఇరాన్‌కే ఎక్కువ నష్టమని ఆయన తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.

చర్చలు విఫలం కావడానికి ప్రధాన కారణం ఇరాన్ తన అణు ఆశయాలను వదులుకోవడానికి నిరాకరించడమేనని వాన్స్ స్పష్టం చేశారు. అమెరికా జెండాల మధ్య నిలబడి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "మా రెడ్ లైన్స్ (నియమ నిబంధనలు) ఏంటో మేము స్పష్టంగా చెప్పాం. కానీ మా షరతులను అంగీకరించేందుకు ఇరాన్ సిద్ధంగా లేదు. అణు ఆయుధాలను తయారు చేయబోమని, అందుకు అవసరమైన పరికరాల...