భారతదేశం, జూన్ 1 -- Dave Fiji and Jessni wedding : అమెరికాలోని జార్జియాలో అత్యంత బాధాకరమైన సంఘటన చోటుచేసుకుంది. వివాహం ముగిసి, 'ఐ డూ' అని ప్రమాణం చేసిన కొన్ని గంటలకే ఒక భారతీయ సంతతి వ్యక్తి చనిపోయాడు! ఒక హెలికాప్టర్ ప్రమాదంలో ప్రాణాలొదిలాడు. డెల్టా ఎయిర్‌లైన్స్‌లో పైలట్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల డేవ్ ఫిజీ (కుటుంబం కేరళ మూలాలున్నది), తన వివాహం ముగిసిన తర్వాత నూతన వధువు జెస్నీతో కలిసి హనీమూన్‌కు వెళుతుండగా.. వారు ప్రయాణిస్తున్న 'రాబిన్సన్ ఆర్66' హెలికాప్టర్ డాసన్‌విల్ వద్ద కూలిపోయింది. ఈ ప్రమాదంలో డేవ్‌తో పాటు హెలికాప్టర్ పైలట్ కూడా మరణించాడు. వృత్తిరీత్యా నర్సు అయిన వధువు జెస్నీ తీవ్ర గాయాలతో ప్రాణాలతో బయటపడింది.

ప్రమాదం జరిగిన తర్వాత సహాయక సిబ్బంది వచ్చే వరకు దాదాపు 6 గంటల పాటు ఆమె భర్త శవం పక్కనే శిథిలాల మధ్య చిక్కుకుపోయింది.

డేవ్ ఫిజీ, ...