భారతదేశం, మే 23 -- Green card rules : అమెరికాలో స్థిరపడాలనే కలలతో తాత్కాలిక వీసాలపై అక్కడే నివసిస్తున్న ఐటీ ఉద్యోగులు, విద్యార్థులు, పర్యాటకులకు యూఎస్ ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది! యునైటెడ్ స్టేట్స్ సిటిజన్‌షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్సీఐఎస్) మే 21, 2026 న ఒక కొత్త వివాదాస్పద పాలసీ మెమోరాండంను జారీ చేసింది. దీని ప్రకారం.. తాత్కాలిక వీసాలపై అమెరికాలో ఉన్న విదేశీయులు గ్రీన్ కార్డు పొందాలంటే.. ఇకపై అమెరికాలో ఉంటూ దరఖాస్తు చేసుకోవడానికి వీలుండదు! వారు తమ స్వదేశానికి తిరిగి వెళ్లి అక్కడి యూఎస్ కాన్సులేట్ ద్వారానే ప్రాసెస్ పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఇంతకుముందు వరకు అమెరికాలో స్టూడెంట్ (ఎఫ్-1), టూరిస్ట్ (బీ-1/బీ-2) లేదా వర్క్ వీసాలపై (హెచ్-1బీ, ఎల్-1) నివసిస్తున్న వారు దేశాన్ని విడిచి వెళ్లకుండానే గ్రీన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకునే ...