భారతదేశం, సెప్టెంబర్ 17 -- అమెరికా సెంట్రల్ బ్యాంక్ 'ఫెడరల్ రిజర్వ్' గ్లోబల్ మార్కెట్లకు షాక్ ఇచ్చింది! పెరిగిన ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేసేందుకు కీలక బెంచ్ మార్క్ వడ్డీ రేట్లను పావు శాతం (25 బేసిస్ పాయింట్లు) పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ పెంపుతో ఫెడరల్ ఫండ్స్ రేటు 3.75 శాతం నుంచి 4 శాతానికి చేరింది. మూడేళ్లకు పైగా వ్యవధి తర్వాత ఫెడ్ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ప్రతీకూల పరిస్థితులు కొనసాగితే ఈ ఏడాది చివర్లో మరొక విడత రేట్ల పెంపు తప్పకపోవచ్చని విధానకర్తలు స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు.

మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉద్రిక్తతలు, క్రూడ్ ఆయిల్ భయాలు, స్థిరమైన ఉపాధి మార్కెట్ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు. "ద్రవ్యోల్బణం వేగంగా తగ్గకపోవడం కలవరపెడుతోంది," అని ఫెడ్ ఛైర్మన్ కెవిన్ వార్ష్ ఇప్పటికే హెచ్చరించిన సంగతి తెలిస...