భారతదేశం, జూన్ 28 -- Urvashi Rautela: ప్రస్తుతం అమెరికా, కెనడా, మెక్సికోల వేదికగా అత్యంత ఉత్కంఠభరితంగా సాగుతున్న ఫిఫా ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2026 ఫీవర్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రీడాభిమానులను ఊపేస్తోంది. ఈ ఫుట్‌బాల్ మాయలో క్రీడాకారులతో పాటు సినీ సెలబ్రిటీలు కూడా మునిగితేలుతున్నారు. తాజాగా బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా సోషల్ మీడియా వేదికగా పోస్టు చేసిన వీడియో ఒకటి వైరల్ గా మారింది.

క్రిస్టియానో రొనాల్డో, అతని దేశం పోర్చుగల్ కు మద్దతుగా ఊర్వశి రౌతేలా ఇవాళ (జూన్ 28) ఇన్ స్టాలో వీడియో పోస్టు చేసింది. పోర్చుగల్ ఆటగాళ్ల విన్నింగ్ సెలబ్రేషన్స్ ను ఇమిటేట్ చేస్తూ ఆమె డ్యాన్స్ చేసింది. అయితే ఈ వీడియోకు నెటిజన్లు గట్టి కౌంటర్లు వేస్తున్నారు. కామెంట్ సెక్షన్లలో మెస్సి పిక్స్ పోస్టు చేస్తున్నారు.

ఊర్వశి రౌతేలా తన ఇన్‌స్టాగ్రామ్‌లో రొనాల్డోకు సపోర్ట్ చేస్తూ ...