భారతదేశం, జూన్ 29 -- Urfi Javed: బాలీవుడ్ బోల్డ్ బ్యూటీ, సోషల్ మీడియా సెన్సేషన్ ఉర్ఫీ జావెద్ తన మతం మార్చుకుందంటూ గత కొన్ని రోజులుగా ఇంటర్నెట్‌లో ఒక వార్త తెగ హల్‌చల్ చేస్తోంది. ఆమె ఇస్లాం మతాన్ని వదిలేసి హిందూ ధర్మాన్ని స్వీకరించిందని, తన పేరును కూడా 'రీటా భరద్వాజ్'గా మార్చేసుకుందంటూ ఒక మహిళా జర్నలిస్ట్ సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేయడం పెద్ద దుమారమే రేపింది. నెగెటివ్ కామెంట్స్, ట్రోల్స్‌ను అస్సలు వదిలిపెట్టని ఉర్ఫీ.. ఈ ఫేక్ న్యూస్ ప్రచారంపై తాజాగా ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందిస్తూ ఆ జర్నలిస్ట్‌కు చుక్కలు చూపించింది.

మీతా చౌదరి అనే ఒక మహిళా జర్నలిస్ట్ ఉర్ఫీ జావెద్‌పై ఒక వీడియో చేస్తూ.. ఉర్ఫీ కేవలం సగం సగం బట్టలు వేసుకోవడం వల్లే ఫేమస్ అయిందని, ఆమె ఇప్పుడు ముస్లిం నుండి హిందువుగా మారిపోయిందని చెప్పింది.

దీనిపై ఉర్ఫీ జావెద్ లైవ్‌లోకి వచ్...