భారతదేశం, నవంబర్ 13 -- భారత ఆటోమొబైల్ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విప్లవం వేగంగా విస్తరిస్తోంది. ఒకప్పుడు కేవలం ఖరీదైన విభాగానికే పరిమితమైన ఈవీలు, ఇప్పుడు సామాన్య, మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటు ధరలోకి వస్తున్నాయి. ప్రస్తుతం రూ. 15 లక్షల లోపు విభాగంలో టాటా మోటార్స్, జేఎస్‌డబ్ల్యూ ఎంజీ, సిట్రోయెన్, మహీంద్రా సంస్థలు హ్యాచ్‌బ్యాక్‌లు, కాంపాక్ట్ ఎస్‌యూవీలు, క్రాసోవర్ మోడళ్లతో గట్టి పట్టు సాధించాయి. ఈ నేపథ్యంలో హ్యుందాయ్, మారుతీ సుజుకీ, రెనాల్ట్, విన్‌ఫాస్ట్ వంటి దిగ్గజ కంపెనీలు రూ. 15 లక్షల లోపు ధరలో సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను భారత రోడ్లపైకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నాయి. త్వరలో మార్కెట్లో సందడి చేయనున్న ఆ కార్ల వివరాలను పరిశీలిద్దాం.

2027 తొలి త్రైమాసికంలో హ్యుందాయ్ సంస్థ భారత మార్కెట్లోకి సరికొత్త కాంపాక్ట్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీన...