Upcoming cars in India : కియా, హ్యుందాయ్ కొత్త అస్త్రాలు.. 2027లో 5 హైబ్రిడ్, ఈవీ కార్లు!
భారతదేశం, నవంబర్ 18 -- పెట్రోల్, డీజిల్ ధరల భారం పెరుగుతుండటంతో భారత వాహనదారులు ఇప్పుడు ప్రత్యామ్నాయ ఇంధన కార్ల వైపు చూస్తున్నారు. వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తమ ఎలక్ట్రిఫైడ్ వాహన శ్రేణిని భారీగా విస్తరించేందుకు దక్షిణ కొరియా ఆటోమొబైల్ దిగ్గజాలు కియా, హ్యుందాయ్ సిద్ధమయ్యాయి. 2027 నవంబర్ నాటికి భారత మార్కెట్లో ఏకంగా ఐదు కొత్త హైబ్రిడ్, ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయాలని ఈ రెండు సంస్థలు లక్ష్యంగా పెట్టుకున్నాయి.
రాబోయే ఈ కొత్త లైనప్లో విలాసవంతమైన ఎంపీవీలు, మధ్యతరహా ఎస్యూవీలతో పాటు సామాన్యులకు అందుబాటు ధరలో ఉండే ఒక సరికొత్త ఎలక్ట్రిక్ ఎస్యూవీ కూడా ఉంది. మెరుగైన మైలేజీ, ఎక్కువ రేంజ్, ఆధునిక సాంకేతికత కోరుకునే కొనుగోలుదారుల కోసం వీటిని ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ జాబితాలో కియా కార్నివాల్ హైబ్రిడ్, సెల్టోస్ హైబ్రిడ్, హ్యుందాయ్ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.