భారతదేశం, జూన్ 15 -- నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) నిర్వహించే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (UGC NET) జూన్ 2025 పరీక్షలు ఈ నెల 25 నుంచి 29 వరకు జరగనున్నాయి. ఈ పరీక్షకు సంబంధించిన సబ్జెక్టుల వారీగా పూర్తి షెడ్యూల్‌ను ugcnet.nta.ac.in వెబ్‌సైట్‌లో విడుదల చేశారు. త్వరలో పరీక్షా కేంద్రం వివరాలతో కూడిన సిటీ స్లిప్‌లు, అడ్మిట్ కార్డులు కూడా విడుదల కానున్నాయి.

ఎన్‌టీఏ మొదట యూజీసీ నెట్ 2025 సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లను విడుదల చేస్తుంది. ఆ తర్వాత అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతుంది. సిటీ స్లిప్‌ల ద్వారా అభ్యర్థులు తమ పరీక్షా కేంద్రం ఏ నగరంలో ఉంటుందో తెలుసుకోవచ్చు. అడ్మిట్ కార్డులో పరీక్షా కేంద్రం చిరునామా, రిపోర్టింగ్ సమయం, పరీక్ష వేళలు, పరీక్ష రోజు పాటించాల్సిన సూచనలు వంటి పూర్తి వివరాలు ఉంటాయి.

యూజీసీ నెట్​ జూన్​ 2...