భారతదేశం, మార్చి 19 -- ఉగాది తెలుగు సంవత్సరంలో వచ్చే మొదటి పండుగ. ఉగాది నాడు పిల్లాపాపలతో సంతోషంగా ఉగాది పచ్చడి తిని ఆనందంగా జరుపుకుంటాము. ఉగాది నాడు చాలా మంది కొత్త పనులను ప్రారంభిస్తారు. ఉగాది నాడు అంతా బాగా కలిసి రావాలని పూజ చేస్తారు, ఇష్ట దైవాన్ని ప్రార్థిస్తారు. దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్లి అర్చన చేయించుకుంటారు. అయితే ఉగాది నాడు పూజ చేయడానికి కావలసిన సామాగ్రి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

దేవుడు విగ్రహాలను పెట్టి పూజిస్తాం కాబట్టి, ఇష్టదైవం విగ్రహం లేదా ఫోటోను ఇంట్లో పెట్టండి. కచ్చితంగా విఘ్నాలను తొలగించే వినాయకుని పూజించండి. వినాయకుడిని ఆరాధించడం వలన శుభ ఫలితాలు కలుగుతాయి, అడ్డంకులు తొలగిపోతాయి, ఆనందంగా ఉండొచ్చు.

అగరబత్తులు స్వచ్ఛతను సూచిస్తాయి. అగరబత్తులను ఇంట్లో వెలిగిస్తే ప్రశాంత వాతావరణం ఏర్పడుతుంది. ఇంట్లో సానుకూల శక్తి ప్...