భారతదేశం, జూలై 21 -- TV Show: ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షోలను అందించడంలో పాపులర్ తెలుగు ఛానెల్ ఈటీవీ ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటుంది. ఈ టీవీ ఛానెల్ ఇప్పుడు మరో బ్లాక్ బస్టర్ ఎంటర్ టైన్మెంట్ షో సీజన్ 2తో బుల్లితెర ప్రేక్షకులను అలరించడానికి వచ్చేస్తోంది. సుడిగాలి సుధీర్ హోస్ట్ చేస్తున్న ఆ షోనే 'ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2'.

ఈటీవీలో సూపర్ హిట్ గా నిలిచిన ఫన్ అండ్ ఎంటర్ టైన్మెంట్ షో 'ఫ్యామిలీ స్టార్స్' నుంచి ఇప్పుడు రెండో సీజన్ వచ్చేస్తోంది. తాజాగా ఈ సీజన్ 2 లాంఛ్ ప్రోమోను ఈటీవీ రిలీజ్ చేసింది. ఇందులో మరోసారి సుడిగాలి సుధీర్ తన యాంకరింగ్ తో అదరగొట్టనున్నాడు. అతని మరదళ్లుగా స్రవంతి చొక్కారపు, అషు రెడ్డి మరోసారి సందడి చేయనున్నారు.

ఫ్యామిలీ స్టార్స్ సీజన్ షో జనరల్ గా మధ్యాహ్నం వచ్చేది. కానీ ఈ సీజన్ 2 టైమింగ్స్ ను మార్చారు. ఫ్యామిలీ స్టార్స్ సీజన్ ...