భారతదేశం, ఏప్రిల్ 24 -- True Friendship Characteristics : "మనిషి జీవితంలో స్నేహానికి మించిన ఆస్తి లేదు" అని అనేక ఉదాహరణలు నిరూపితం చేశాయి. ఈ భూమి మీదకు వచ్చినప్పుడు మనం మన కుటుంబాన్ని ఎంచుకోలేము కానీ కుటుంబంతో సమానమైన ఫ్రెండ్స్​ని మాత్రం ఎంచుకోగలము! కానీ నేటి సోషల్ మీడియా యుగంలో 'ఫ్రెండ్ లిస్ట్' వేలల్లో ఉన్నా, మనసు విప్పి మాట్లాడుకునే మిత్రుడు ఒక్కడు కూడా లేకపోవడం ఒక చేదు నిజం. స్నేహం అనేది కేవలం వాట్సాప్ మెసేజ్‌లకు, వారాంతపు పార్టీలకు పరిమితం కాకూడదు. అది ఒక మానసిక రక్షణ కవచం. మరి ఆ బంధాన్ని సరిగ్గా అర్థం చేసుకోవడం ఎలా?

గ్రీకు తత్వవేత్త అరిస్టాటిల్.. స్నేహాన్ని మూడు రకాలుగా వర్గీకరించారు. మొదటిది 'ప్రయోజనం కోసం చేసే స్నేహం' (యుటిలిటీ). పనులు పూర్తయ్యే వరకే ఇది ఉంటుంది. రెండోది 'ఆనందం కోసం చేసే స్నేహం' (ప్లెజర్). సరదాలకు మాత్రమే పరిమితం....