భారతదేశం, మే 20 -- Trisha Vijay: స్టార్ హీరోయిన్ త్రిష కృష్ణన్ ప్రస్తుతం తన వ్యక్తిగత, వృత్తిపరమైన జీవితాలతో నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఆమె కథానాయికగా నటించిన తాజా చిత్రం 'కరుప్పు' (Karuppu) థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శనతో దూసుకుపోతూ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది.

ఈ భారీ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ త్రిష సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఆ పోస్ట్‌లో ఆమె రాసిన క్యాప్షన్ వెనుక తమిళనాడు సీఎం, నటుడు జోసెఫ్ విజయ్ ఉన్నారంటూ ఫ్యాన్స్ డీకోడ్ చేయడం ఆసక్తికరంగా మారింది.

త్రిష తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో 'కరుప్పు' సినిమా షూటింగ్ సెట్స్‌కు సంబంధించిన కొన్ని బిహైండ్ ది సీన్స్ (BTS) ఫొటోలను పంచుకుంది. అందులో ఆమెతో పాటు హీరో సూర్య, ఆర్జే బాలాజీ ఉన్నారు.

ఈ ఫొటోలకు ఆమె పెట్టిన క్యాప్షన్ అభిమానుల ద...