భారతదేశం, జూలై 3 -- Trisha Krishnan: స్టార్ హీరోయిన్ త్రిష ఆన్‌లైన్ షాపింగ్ చేసి తీవ్ర నిరాశకు గురైంది. ఏకంగా ఇంటర్నేషనల్ బ్రాండ్ జారా (Zara) పై ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫైర్ అవ్వడం ఇప్పుడు కోలీవుడ్ టు టాలీవుడ్ హాట్ టాపిక్ గా మారింది. ఏమాత్రం మొహమాటం లేకుండా ఆ బ్రాండ్ బండారాన్ని సోషల్ మీడియాలో బయటపెట్టింది మన సౌత్ క్వీన్.

వరుసగా మూడుసార్లు చెమట కంపు కొడుతున్న బట్టలు డెలివరీ చేశారంటూ జారా బ్రాండ్‌పై త్రిష తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. హోమ్ డెలివరీ చేసేటప్పుడు కనీసం ప్యాక్ చేసే ముందైనా స్మెల్ చూడండి అంటూ తన ఇన్‌స్టా స్టోరీలో ఘాటుగా కౌంటర్ వేసింది. ఇంత పెద్ద బ్రాండ్ నుంచి ఇలాంటి 'దారుణమైన' అనుభవం ఎదురవ్వడంతో ఆమె ఫ్యాన్స్ కూడా షాక్ అవుతున్నారు.

జారా లాంటి ప్రీమియం బ్రాండ్‌కు ఇండియాలో లక్షలాది మంది రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు. త్రిషలాంటి ఒక స్...