భారతదేశం, ఏప్రిల్ 7 -- స్టార్ హీరోయిన్ సినిమాలు మానేసింది. పెళ్లి చేసుకుంది. నలుగురు పిల్లలను కూడా పెంచుతోంది. ఇదంతా ఎప్పుడు జరిగింది? అసలు ఇందులో ఏమైనా నిజం ఉందా? అని అనుకుంటున్నారా? మీ ప్రశ్నలు కరెక్టే. అయితే ఇన్ స్టాగ్రామ్ స్టోరీ ద్వారా ఈ విషయాలు చెప్పిన త్రిష లాస్ట్ లో ఓ ట్విస్ట్ ఇచ్చింది.

సినిమాల నుంచి త్రిష తప్పుకుంటున్నారంటూ సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె ఘాటుగా స్పందించింది. తాను రిటైర్ అయిపోయి, పిల్లలను పెంచుకుంటున్నాననే వార్తలపై సెటైరికల్ గా ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు పెట్టింది. పెళ్లి చేసుకున్నానని ఇందులో పేర్కొంది.

"అవును.. నేను సినిమాలు మానేశా. ఒక కోటీశ్వరుడైన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నా. ఇప్పుడు నలుగురు పిల్లలను పెంచుతున్నా. ఏంటి, ఈరోజుకి మీ కల్పిత వార్తల కోటా పూర్తయిందా?" అంటూ త్రిష తనపై వస్తున్న పుకార్లపై గట్టిగ...