భారతదేశం, జూన్ 2 -- Trisha: 'మ్యాజికల్ మే' అంటూ మే నెల మెమోరీస్ లో ఉండిపోయింది స్టార్ హీరోయిన్ త్రిష. ఈ మేరకు తన ఇన్ స్టాగ్రామ్ లో తాజాగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. మ్యాజికల్ మే నుంచి తీపి జ్ఞాపకాలు అంటూ పోస్టు పెట్టేసింది. అసలు మే నెలలో ఏం జరిగింది? ఈ నెల ఆమెకు ఎందుకు ఇంత స్పెషల్ గా మారిందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

త్రిష తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లో మే నెల జ్ఞాపకాలకు సంబంధించిన సరికొత్త ఫొటోలను పంచుకుంది. గడిచిన కొన్ని వారాల్లో తన జీవితంలో చోటుచేసుకున్న ప్రత్యేకమైన, అత్యంత ఆత్మీయమైన క్షణాలను త్రిష అభిమానులతో షేర్ చేసుకుంది. గ్లామర్ ప్రపంచానికి దూరంగా, తన వ్యక్తిగత జీవితంలో ఎంతటి ప్రశాంతతను ఆస్వాదించిందో ఈ ఫొటోల ద్వారా చాటిచెప్పింది. ఈ పోస్ట్ వైరల్ గా మారింది.

"మ్యాజికల్ మే నుంచి మరికొన్ని స్వీట్ మెమోరీస్.. వీటిని చూస్తూ చాల...