భారతదేశం, అక్టోబర్ 2 -- ఆన్‌లైన్ ట్రేడింగ్ యాప్‌ల మోజు, ఒక్క రోజులోనే లక్షలు సంపాదించవచ్చనే భ్రమలు ఎంతోమంది మధ్యతరగతి జీవితాలను నాశనం చేస్తున్నాయి. నెలకు రూ.2 లక్షల వేతనం, రూ.14 లక్షల పొదుపుతో హాయిగా సాగిపోతున్న ఒక 35 ఏళ్ల ఐటీ ఇంజనీర్.. ఆప్షన్స్ ట్రేడింగ్ వ్యామోహంలో పడి ఏకంగా రూ.38 లక్షలు పోగొట్టుకున్న ఉదంతం సామాజిక మాధ్యమం 'ఎక్స్'లో ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

హెమ్‌దర్పణ్ అనే ఎక్స్ యూజర్ తన స్నేహితుడి జీవితంలో జరిగిన నిజమైన సంఘటనను ఎక్స్​లో షేర్ చేశాడు. సదరు సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి అతని సహోద్యోగి ఒకరోజు లంచ్ సమయంలో జెరోధా యాప్ డాష్‌బోర్డ్ చూపించాడు. నిఫ్టీ ఆప్షన్లలో కేవలం 45 నిమిషాల్లో రూ.12,000 సంపాదించినట్లు కనిపించడంతో, దీర్ఘకాలిక పెట్టుబడుల కంటే ఇంట్రాడే ట్రేడింగ్ చాలా సులువని అతడు నమ్మాడు.

ప్రారంభంలో కేవలం రెండు గంటల్లో రూ....