భారతదేశం, మార్చి 25 -- టయోటా సంస్థ తన మోస్ట్ ఎవైటెడ్ ఎస్‌యూవీ 'ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే' ను ఎట్టకేలకు లాంచ్​ చేసింది. థాయ్‌లాండ్‌లో జరుగుతున్న 47వ బ్యాంకాక్ ఇంటర్నేషనల్ మోటార్ షో 2026లో ఈ వాహనాన్ని అధికారికంగా ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్‌లోనే దీనికి సంబంధించిన టీజర్‌ను విడుదల చేయగా ఇప్పుడు మోడల్​ని అధికారికంగా రివీల్​ చేసింది. అంతేకాదు, ఈ నెలాఖరు నుంచే థాయ్‌లాండ్‌లో అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. అక్కడ ఈ మోడల్ కేవలం 4డబ్ల్యూడీ 2.7 వేరియంట్‌లో మాత్రమే లభ్యం కానుంది. దీని ప్రారంభ ధరను 1.269 మిలియన్ బాట్ (భారత కరెన్సీలో సుమారు రూ. 36.40 లక్షలు) గా నిర్ణయించారు.

ప్రస్తుత కాలంలో వస్తున్న చాలా కాంపాక్ట్ ఎస్‌యూవీలు కార్ల ప్లాట్‌ఫామ్‌లపై ఆధారపడి తయారవుతున్నాయి. కానీ, ల్యాండ్ క్రూయిజర్ ఎఫ్​జే మాత్రం పాత పద్ధతినే అనుసరించింది. ఇది టయోటాకు చెంది...