భారతదేశం, మార్చి 4 -- బిగ్ బ్రేకింగ్.. రిలీజ్ కు ఇంకా 16 రోజులు మాత్రమే ఉండగా టాక్సిక్ మూవీ మేకర్స్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. కన్నడ స్టార్ యష్ హీరోగా నటించిన ఈ సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరాన్ పై అమెరికా, ఇజ్రాయెల్ ఉమ్మడి దాడి కారణంగా మిడిల్ ఈస్ట్ దేశాల్లో నెలకొన్న పరిస్థితులే ఇందుకు కారణం. టాక్సిక్ రిలీజ్ ను వాయిదా వేసిన నిర్మాతలు కొత్త విడుదల డేట్ ను కూడా ప్రకటించారు.

టాక్సిక్ పోస్ట్ పోన్

"టాక్సిక్: ఎ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్".. ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సినిమా. కేజీఎఫ్ సినిమాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన యష్ నాలుగేళ్ల తర్వాత తిరిగి సిల్వర్ స్క్రీన్ మీదకు టాక్సిక్ మూవీతో రాబోతున్నాడు. ముందు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా మూవీ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ తాజాగా ఈ మూవీ ...