భారతదేశం, సెప్టెంబర్ 7 -- Toxic OTT: కేజీఎఫ్ ఛాప్టర్ 2తో ప్రపంచవ్యాప్తంగా బాక్స్ ఆఫీస్ రికార్డులను తిరగరాసిన రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ ప్యాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' మేకర్స్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. థియేటర్లలో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా.. డిజిటల్, శాటిలైట్ హక్కులు అమ్ముడుపోక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. విడుదలకి ముందు రూ. 200 కోట్లు డిమాండ్ చేసిన నిర్మాతలకు ఇప్పుడు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ కేవలం రూ. 30 కోట్లు మాత్రమే ఆఫర్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

థియేట్రికల్ రిలీజ్‌కి ముందు 'టాక్సిక్' సినిమాపై ఉన్న విపరీతమైన అంచనాల నేపథ్యంలో ఒక ప్రముఖ లీడింగ్ ఓటీటీ సంస్థ ఏకంగా రూ. 150 కోట్ల భారీ ఆఫర్‌తో ముందుకు వచ్చింది. అయితే తమ సినిమా కచ్చితంగా ఆల్-టైమ్ బ్లాక్‌బస్టర్ హిట్ అవుతు...