భారతదేశం, జూలై 1 -- Toxic Ladies Teaser: "లేడీస్ అండ్ లేడీస్".. పేరు చూసి యశ్ (Yash) నటిస్తున్న 'టాక్సిక్' (Toxic) సినిమాలో హీరోయిన్ల రోల్స్ ఎలా ఉండబోతున్నాయో అని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ తీరా టీజర్ రిలీజ్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. లేడీస్ టీజర్‌లో కూడా యశ్ డామినేషన్ ఏంటి అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. సోషల్ మీడియాలో టాక్సిక్ టీజర్‌పై ట్రోల్స్ ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.

కేజీఎఫ్ 2 (KGF 2) 2022లో రిలీజై ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసింది. దాదాపు నాలుగేళ్ల లాంగ్ గ్యాప్ తర్వాత రాకింగ్ స్టార్ యశ్ మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీదకు వస్తుండటంతో ఈ కమ్‌బ్యాక్ మూవీపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. గీతూ మోహన్‌దాస్ (Geetu Mohandas) డైరెక్ట్ చేస్తున్న ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్‌ టాక్సిక్ లో నయనతార, కియారా అద్వానీ, హుమా ఖురేషి, తారా ...