భారతదేశం, ఆగస్టు 30 -- Toxic Collections: రాకింగ్ స్టార్ యశ్ లేటెస్ట్ మూవీ 'టాక్సిక్: ఏ ఫెయిరీ టేల్ ఫర్ గ్రోన్-అప్స్' (Toxic: A Fairy Tale for Grown-Ups) బాక్సాఫీస్ దగ్గర నెమ్మదిగా సాగుతోంది. విడుదలైన తొలిరోజే రికార్డు స్థాయి వసూళ్లను సాధించిన ఈ సినిమాకు నెగెటివ్ టాక్ ఇబ్బందిగా మారింది. శనివారం నాటి వసూళ్లతో ఈ సినిమా రూ.250 కోట్ల గ్రాస్ మార్కును దాటేసి సరికొత్త మైలురాయిని చేరుకుంది.

ట్రేడ్ అనలిస్ట్ సంస్థ 'సాక్‌నిల్క్' (Sacnilk) అందించిన గణాంకాల ప్రకారం, శనివారం (4వ రోజు) భారతదేశవ్యాప్తంగా 17,612 షోలో 'టాక్సిక్' చిత్రం రూ.25.15 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది. దీంతో ఇప్పటివరకు ఇండియాలో ఈ సినిమా మొత్తం నెట్ వసూళ్లు రూ.191.10 కోట్లకు చేరుకోగా, గ్రాస్ వసూళ్లు రూ.228.25 కోట్లుగా నమోదయ్యాయి.

మరోవైపు విదేశీ మార్కెట్లలోనూ యశ్ మేనియా కొనసాగుతోంది...