భారతదేశం, జూలై 1 -- Toxic: కేజీఎఫ్ సిరీస్ తర్వాత గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన రాకింగ్ స్టార్ యశ్ అప్ కమింగ్ మూవీ 'టాక్సిక్' పై అంచనాలు ఏ స్థాయిలో ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఈ సినిమా మేకర్స్ ఒక వినూత్నమైన ప్రమోషనల్ వీడియోతో సర్ ప్రైజ్ చేశారు. కేవలం ఈ మూవీలోని హీరోయిన్ల పవర్‌ఫుల్ క్యారెక్టర్లను హైలైట్ చేస్తూ కట్ చేసిన ఈ 'లేడీస్ & లేడీస్' వీడియో సోషల్ మీడియాను ఊపేస్తోంది.

టాక్సిక్ లేడీస్ అండ్ లేడీస్ వీడియో ప్రారంభమే ఒక సెన్సేషనల్, ప్రోవోకేటివ్ ఏజ్ బేస్డ్ డిస్ క్లెయిమర్ తో మొదలైంది. "పిల్లలు.. దూరంగా ఉండండి. తల్లిదండ్రులు.. మీ పిల్లలు దీనికి దూరంగా ఉండేలా చూసుకోండి. తాత ముత్తాతలు.. మీ ఓన్ రిస్క్‌పైనే చూడండి" అంటూ సినిమాలోని వైల్డ్ అండ్ డార్క్ కంటెంట్‌ను ముందే హింట్ ఇచ్చారు.

ఆ తర్వాత బ్యాక్‌గ్రౌండ్‌లో వచ్చే ఒక లేడీ వాయిస్‌ ఓవర్.....