భారతదేశం, సెప్టెంబర్ 24 -- Top 10 Movies 2026: హిందీ యాక్షన్ డ్రామా 'ధురందర్: ది రివెంజ్' ఏకంగా రూ. 1,700 కోట్లకు పైగా వరల్డ్‌వైడ్ కలెక్షన్లు సాధించి 2026 బాక్సాఫీస్ కింగ్‌గా నిలిచింది. ఇండియన్ సినిమా హిస్టరీలోనే సరికొత్త రికార్డులు క్రియేట్ చేసిన ఈ చిత్రం గ్లోబల్ వైడ్‌గా రూ. 1,714.8 కోట్ల నుంచి రూ. 1,852 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభంజనం సృష్టించింది. మిగిలిన సినిమాలన్నీ రూ. 500 కోట్ల లోపే పరిమితం కావడం గమనార్హం.

ఈ ఏడాదంతా ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి పండగే అని చెప్పాలి. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర మాస్ ర్యాంపేజ్ ఆడాయి. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి 2026లో అత్యధిక వసూళ్లు తెచ్చిపెట్టిన టాప్ 10 సినిమాల వివరాలు ఇవే.

రణ్‌వీర్ సింగ్, ఆదిత్య ధర్ కాంబోలో వచ్చిన ఈ హై-వోల్టేజ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ 'ధురంధర్: ది రివెంజ్'...