భారతదేశం, జూలై 28 -- Tollywood: పాన్-ఇండియా రేంజ్‌లో భారీ యాక్షన్ సీన్స్ చేస్తుండటంతో టాలీవుడ్ టాప్ స్టార్లకు వరుసగా గాయాలు కావడం ఇండస్ట్రీని షాక్‌కి గురిచేస్తోంది. ముఖ్యంగా మెగా, నందమూరి కుటుంబాలకు చెందిన నటులకే ఇలా జరుగుతుండటం గమనార్హం. యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా భుజం గాయంతో 8 వారాల పూర్తి రెస్ట్‌లోకి వెళ్లగా.. ఆయనతో పాటు రామ్ చరణ్, పవన్ కళ్యాణ్, నందమూరి బాలకృష్ణ, చిరంజీవి, వరుణ్ తేజ్ వరుసగా సర్జరీలు చేయించుకోవాల్సి వచ్చింది. టాలీవుడ్‌లో ఒకరి తర్వాత ఒకరు స్టార్ హీరోలు ఆసుపత్రుల పాలవుతుండటంతో మెగా, నందమూరి అభిమానులు తీవ్ర కలవరానికి గురవుతున్నారు.

ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న 'డ్రాగన్' సినిమా షూటింగ్ లో ఉన్న ఎన్టీఆర్‌కు అనూహ్యంగా భుజానికి తీవ్ర గాయమైంది. డాక్టర్లు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత కనీసం 6 నుంచి 8 వారాల ప...