భారతదేశం, జూన్ 18 -- Today OTT Telugu: టాలీవుడ్‌లో మీడియం, చిన్న బడ్జెట్ సినిమాలకు థియేట్రికల్ రన్ ఎంత రిస్క్‌గా మారిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే చాలా మంది నిర్మాతలు ఇప్పుడు హోమ్ స్క్రీన్స్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో ఇవాళ (జూన్ 18) మూడు తెలుగు సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ఇవి మూడు డిఫరెంట్ జోనర్లలో తెరకెక్కాయి.

క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్న 'ఈటీవీ విన్' ప్లాట్‌ఫామ్‌లో తాజాగా 'జయముంది భయమేల మనసా' అనే విన్ ఎక్స్‌క్లూజివ్ ఒరిజినల్ ఫిల్మ్ డిజిటల్ ప్రీమియర్ అయింది. గురువారం నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. సరికొత్త లవ్, ఫ్రెండ్ షిప్ అండ్ ఎంటర్‌టైనింగ్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ సినిమా హోమ్ స్క్రీన్స్‌పై ఫ్యామిలీ ఆడియన్స్‌ను టార్గెట్ చేస్తోంది.

ముగ్గురు ఫ్రెండ్స్ సైకిళ్లపై లాంగ్ రోడ్...