భారతదేశం, ఆగస్టు 21 -- Today OTT: బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా, భారీ తారగణంతో తెరకెక్కిన కామెడీ ఎంటర్‌టైనర్ 'వెల్కమ్ టు ది జంగిల్' (Welcome to the Jungle) డిజిటల్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. థియేటర్లలో విడుదలైన సమయంలో మిక్స్ డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ.. ఇప్పుడు ఓటీటీ లవర్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు వచ్చేసింది.

బాలీవుడ్ లో రీసెంట్ టైమ్స్ లో డీసెంట్ హిట్ గా నిలిచిన వెల్కమ్ టు ది జంగిల్ మూవీ ఓటీటీలోకి అడుగుపెట్టింది. ఇవాళ (ఆగస్టు 21) నుంచి డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది. పాపులర్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ జియోహాట్‌స్టార్ (JioHotstar) వేదికగా ఈ సినిమా ఆగస్టు 21, 2026 నుంచి ఓటీటీ లవర్స్ కు అందుబాటులోకి వచ్చింది.

​ఈ ఏడాది జూన్ 26న థియేటర్లలో విడుదలైన ఈ వెల్కమ్ టు ది జంగిల్ మూవీ.. 2007లో వచ్చిన ఆల్ టైమ్ హిట్ మూవీ 'వెల్కమ్' సాధించినంత విజయాన్...